ETV Bharat / state

ఉజ్జయిని ఉత్సవాలకు రాఘవపూర్​ ఒగ్గుడోలు కళాకారులు ఎంపిక.. - రాఘవపూర్​ ఒగ్గు డోలు

MP Ujjain festival selected Peddapalli drum artists: తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులకు ఉజ్జయిని ఉత్సవాల్లో ఒగ్గుకలను ప్రదర్శించే అవకాశం దక్కింది. ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొనడంతో రాష్ట్రానికే కీర్తిని తీసుకొచ్చింది. ఈ వేడుకలో తమ కళాకారులు రాణించి ప్రత్యేక గుర్తింపు పొందాలని గ్రామస్తులు ఆకాక్షించారు.

ragavpur drum artists
రాఘవపూర్ ఒగ్గు డోలు కళాకారులు
author img

By

Published : Oct 9, 2022, 2:57 PM IST

MP Ujjain festival selected Peddapalli drum artists: నాగపూర్ సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో జరిగే ఉత్సవాలకు పెద్దపల్లి మండలం రాఘవపూర్ ఒగ్గుడోలు కళాకారులు ఎంపికయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో వివిధ కళారూపాలను ప్రదర్శించేందుకు కొన్ని రాష్ట్రాలకు ఆహ్వానం అందింది.

తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులకు ఒగ్గుకళను ప్రదర్శించే అవకాశం దక్కింది. దేశం మొత్తం మీద 15 టీమ్​లు ప్రదర్శన ఇవ్వనున్నాయి. అందులో రాఘవపూర్ టీం పాల్గొనడం చాలా గర్వంగా ఉందని... ఒగ్గుడోలు కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారిలో కుంట సదయ్య, కుంట రాజకుమార్, కుంట సదయ్య, కుంట రమేష్, ఈరు రమేష్, జంగిలి దిలీప్, రమేష్ లతో మరికొంతమంది కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.

దేశస్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఇప్పటికే రాఘవపూర్ ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రాఘవపూర్ ఒగ్గుడోలు ప్రదర్శనను నేటితరం యువకులు అందిపుచ్చుకొని రాణిస్తున్నారు. ఉజ్జయినిలో కూడా నేటితరం యువకులు రాణించి ప్రత్యేక గుర్తింపు పొందాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.