పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తన నివాసంలో బైఠాయించి దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముందు పోలీసుల అధిక సంఖ్యలో మోహరించారు. గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే జలదీక్షలో పాల్గొనేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చూస్తోందని శ్రీధర్‌బాబు ఆరోపించారు.
అప్పడు గుర్తురాలేదా?
సీఎం కేసీఆర్, మంత్రులతో కలిసి కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి గుర్తురాలేదా అంటూ ప్రశ్నించారు. మంథనిలో ప్రాజెక్టులు కట్టినా.. అక్కడి ప్రజలకు నీరు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌లను ఖండిస్తూ శ్రీధర్‌బాబు ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!