ETV Bharat / state

'కరోనా బాధితులు భయాందోళనలకు గురి కావొద్దు'

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పీపీఈ కిట్లు ధరించి.. చికిత్స పొందుతోన్న కొవిడ్​ బాధితులను పరామర్శించారు.

mla korukanti chander
mla korukanti chander
author img

By

Published : Apr 30, 2021, 10:32 PM IST

కొవిడ్​ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ విజ్ఞప్తి చేశారు. నగర మేయర్ అనిల్​తో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పీపీఈ కిట్లు ధరించి.. చికిత్స పొందుతోన్న కొవిడ్​ బాధితులను ఆయన పరామర్శించారు.

రామగుండం నియోజకవర్గంలో కరోనా బాధితుల కోసం 30 పడకల వార్డును సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. బాధితులు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దన్నారు ఎమ్మెల్యే. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ మహమ్మారి నుంచి బయటపడాలని సూచించారు. ప్రజలంతా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని కోరారు.

ఇదీ చదవండి: నకిలీ రెమ్‌డెసివిర్‌ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.