రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర వస్తువులతో పాటు రూ.10 వేల చొప్పున పండుగ బోనస్‌గా అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా బట్టలు, నిత్యావసరాలతో పాటు రూ.10 వేలు అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
లాక్డౌన్లో ప్రజలకు ఎంతో ధైర్యాన్ని కల్పించిన పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. వరద బాధితులకు కారెం రవీందర్ రెడ్డి ఆర్థిక సాయం