కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ సత్యనారాయణ అన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని కూరగాయల మార్కెట్ వ్యాపారులకు కొవిడ్ వ్యాప్తిపై అవగాహన కల్పించారు.
జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతంలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని ఎమ్మెల్యే చందర్ అన్నారు. వ్యాపారులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారులు ఉదయం 6 నుంచి 10 గంటల లోపు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని సీపీ చెప్పారు. ఆంక్షలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కట్టడికి వ్యాపారులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఫైజర్పై నెలకొన్న ప్రతిష్టంభనను త్వరగా తొలగించండి'