పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో రైతు వేదిక భవనం నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికల ద్వారా రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి సమస్యలున్నా రైతు వేదిక వద్ద చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి