ETV Bharat / state

కార్మిక వ్యతిరేక విధానాలను భాజపా నేతలు ప్రశ్నించాలి: ఎమ్మెల్యే - latest news of peddapalli

కేంద్రం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రం వైఖరిని భాజపా నేతలు ప్రశ్నించాలని ఆయన కోరారు.

mla chander fire on central government at ramagundam in peddapalli
కార్మిక వ్యతిరేక విధానాలను భాజపా నేతలు ప్రశ్నించాలి: ఎమ్మెల్యే ​
author img

By

Published : Jul 13, 2020, 12:36 PM IST

కార్మిలకు హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ 41 బొగ్గు బ్లాక్​లను కేంద్రం ప్రైవేటీకరణ చేయడంపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు బి.వెంకట్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

బొగ్గు బ్లాక్​ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకమంతా ఒక్క తాటిపై ఉండి పోరాడాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని భాజపా నేతలు ప్రశ్నించాలన్నారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, టీబీజీకేఎస్ అధ్యక్షులు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కేంద్ర నాయకులు జహీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.