ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన భాజపాకు నిజాయితీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మాట్లాడిన మంత్రి... నైతిక విలువలు లేకుండా మతవాదపు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాటలకు తెరాస భయపడే ప్రసక్తే లేదని... ఎప్పుడు ఎన్నికలు జరిగినా... తెరాస అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలను రెచ్చగొట్టే మాటలు మానుకోకపోతే... చూస్తూ ఊరుకోమని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. మాయమాటలు చెప్పి గ్రేటర్ హైదరాబాద్‌లో ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అర్వింద్.. ఏడాదిన్నర గడిచినా ఎందుకు తేలేదని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా హామీలు నెరవేర్చని నాయకులు తెరాసపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.
ఇదీ చూడండి: పేద క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం: హరీశ్ రావు