నూతన వ్యవసాయ చట్టాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నిన కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై రైతాంగం గళం ఎత్తాల్సిన సమయం వచ్చిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా పాలితం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఏడేళ్లలోనే భారీ ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాన్ని చక్కదిద్దినట్లు మంత్రి వెల్లడించారు.
కానీ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తున్నట్లు పేర్కొనడంతో రైతాంగం అయోమయానికి గురవుతున్నట్లు చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంటూ ప్రజల్లోకి వచ్చిన భాజపా నాయకులను రైతులు నిలదీయాలని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: ట్రామాకేర్ సెంటర్‌గా శామీర్‌పేట్ ఆస్పత్రి : ఈటల