ఇసుక లారీల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. లారీ ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటనా స్థలాన్ని శ్రీధర్‌బాబు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మంథని-పెద్దపల్లి రహదారిపై లారీలు మితిమీరిన వేగంతో వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇసుక లారీలు భూపాలపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నా.. మంథని నుంచి ఎందుకు అనుమతిస్తున్నారని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
ఇవీ చూడండి: ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక