ETV Bharat / state

'తెరాస, భాజపా రెండూ ఒక గూటి పక్షులే..' - కేసీఆర్​, నరేంద్రమోదీపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు విమర్శలు

తెరాస, భాజపా ఒక్క గూటి పక్షులేనని.. పైకి మాత్రం విమర్శలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవపట్టిస్తుంటారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు ఆరోపించారు. తెరాస రెండేళ్ల పాలన వైఫల్యాలపై శ్రీధర్​బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

manthani mla comments on kcr and narendra modi meeting
'తెరాస, భాజపా రెండూ ఒక గూటి పక్షులే..'
author img

By

Published : Dec 13, 2020, 4:33 PM IST

Updated : Dec 13, 2020, 4:57 PM IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీని సీఎం కేసీఆర్​ కలవడంలో ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్​ చేశారు. తెరాస, భాజపా ఒక్క గూటి పక్షులేనని... పైకి మాత్రం విమర్శలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవపట్టిస్తుంటారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే తెరాస, భాజపా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న 33 అంశాలకి సంబంధించిన ఒప్పందాలు ఇంకా పెండింగ్​లో ఉన్నాయని శ్రీధర్​బాబు పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని అర్హతలతో కూడిన అభ్యర్థిని పీసీసీ అధ్యక్షునికి నియమిస్తారని శ్రీధర్​ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్​ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

'తెరాస, భాజపా రెండూ ఒక గూటి పక్షులే..'

ఇదీ చదవండి: 'భూములిచ్చేందుకు మేము సిద్ధం... తగిన పరిహారం ఇప్పించండి'

Last Updated : Dec 13, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.