ETV Bharat / state

'కాంగ్రెస్​ అభ్యర్థుల్ని గెలిపించి సోనియా రుణం తీర్చుకుందాం'

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కోసం పోరాడిన వారికే ఓటేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.  పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్​కు మద్దతుగా సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Apr 8, 2019, 5:24 PM IST

కాంగ్రెస్​కే మా మద్దతు

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ మద్దతు పలుకుతోందని మందకృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో సగానికి పైగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు కాదన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు.

కాంగ్రెస్​కే మా మద్దతు

ఇదీ చదవండి: 'బాగా తిట్టండంటూ కేసీఆర్​కు మోదీ ఫోన్ చేసి చెప్తరు'

Intro:ఫైల్: TG_KRN_41_08_MANDA KRISHNA MADIGA_MEET_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కోసం పోరాడిన వారికే ఓట్లు వేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈరోజు పెద్దపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ కు మద్దతుగా విలేకరుల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ మద్దతు పలుకుతోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస ప్రభుత్వం నిలబెట్టిన పార్లమెంట్ అభ్యర్థులెవరూ తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు కాదన్నారు. కేవలం అధికారాన్ని దక్కించుకునేందుకు తనకు ఇష్టం వచ్చిన వారిని ని ఎంపీ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు అందర్నీ ఎన్నికల్లో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. అలాగే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తెరాస అభ్యర్థిగా బరిలో ఉన్న బోర్లకుంట వెంకటేష్ ఏనాడైనా తెలంగాణ కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
బైట్: మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.