పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోదావరి నదికి మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యాక్రంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మంగళ హారతులతో గౌతమేశ్వర స్వామి దేవాలయం నుంచి నదీ తీరానికి చేరుకున్నారు. నదులను కలుషితం చేయొద్దని, నదుల విశిష్టతను సనక సనంద స్వామీజీ భక్తులకు వివరించారు. ఏక హారతి, పంచహారతి, నక్షత్ర హారతి, మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదీ చూడండి: 'దుర్గమ్మా... ముఖ్యమంత్రి మనసు మార్చమ్మా'