పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ప్రారంభమైనా.. 88 వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు అయితే ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల 34 మంది మాత్రమే పని చేస్తున్నారని వామపక్ష నేతలు మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది తక్కువ ఉండటం వల్ల ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల రోజులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. గర్భిణీలు కూర్చోవడానికి సరైన వసతులు లేవని, తాగునీరు కూడా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించి, మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'ఎస్పీబీకి కరోనా నెగటివ్.. అవాస్తవమన్న చరణ్'