పెద్దపల్లి శివారులో ప్రమాదవశాత్తు కృష్ణవేణి పాఠశాల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాలకు చెందిన టాటా ఏస్ వాహనం పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొస్తోంది. ఈ సమయంలో పట్టణ శివారుకు రాగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు 108 వాహనంలో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కు కరోనా ముప్పు... త్వరలో పరీక్షలు?