కేంద్రంలో ప్రాంతీయ కూటమే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తెరాస సన్నాహక సభలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనూ.. రైతులకు ఉచిత విద్యుత్ లేదని.. తెలంగాణలో మాత్రమే ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. ఉత్తర భారత్‌లో సగం రాష్ట్రాలు చీకట్లోనే ఉన్నాయని ఆవేదన చెందారు. 16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని, దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తానన్నారు.
ఇవీ చూడండి:'మెదక్‌తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'