2 వేల మంది విద్యార్థులతో కలరియపట్టు ప్రదర్శన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపెల్లి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కలరియపట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన అతి ప్రాచీనమైన కలరియపట్టు శిక్షణ పెద్దపెల్లి జిల్లా విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఆత్మరక్షణలో దోహదపడే ఈ ప్రదర్శన పట్ల విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రెండు వేల మంది విద్యార్థులతో ఆదివారం నాడు కలరియపట్టు ప్రదర్శన నిర్వహించారు. ఈ శిక్షణను కలెక్టర్ శ్రీ దేవసేనతో పాటు ప్రజలు, పోలీసు అధికారులు ఆనందంగా వీక్షించారు.
ఇవీ చూడండి: అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్బీ మద్దతు