పెద్దపల్లి నుంచి కరీంనగర్ వెళ్లేందుకు వీలుగా నీరుకుల్లా- వేగురుపల్లి గ్రామాల మధ్య అధికారులు వంతెన నిర్మించారు. కానీ దీనిని అసంపూర్తిగా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వంతెనకు అనుసంధాన రహదారులు, నిర్మాణాలు లేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
మానేరు బ్రిడ్జ్ దాటిన తర్వాత నీరుకుల్లా మీదుగా రాజీవ్ రహదారికి వాహనాలు వెళ్లేందుకు పెద్దపల్లి- సుల్తానాబాద్- నిజామాబాద్ రైల్వే లైన్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దారిలో అండర్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ దీని కింద నుంచి వాహనాలు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలకు గురై పట్టుతప్పి బ్రిడ్జి కింద పడి... మృత్యువాతపడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి... సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. యాదాద్రి పునరుద్ధరణ పనులు