పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నకిలీ వైద్యుడి నిర్వాకానికి బాధ్యుడిగా సుశీల్ అనే ఒప్పంద వైద్యుడిని విధుల్లోంచి తొలగించారు. మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో రాజు అనే నకిలీ వైద్యుడు మరొకరి బదులుగా విధులు నిర్వర్తించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సంబంధిత వైద్యుడిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి : తల్లిప్రేమ ముందు తలవంచిన యముడు