పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్లో మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. నియోజకవర్గంలోని కమాన్పూర్, ముత్తారం, మంథని, రామగిరి మండలాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వానల రాకతో నాట్లకు సిద్ధమవుతున్న దశలో భారీ వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని వంతెనలు కుంగిపోయి ప్రమాద స్థితిలో చేరుకున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి: 15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు కన్నుమూత