హమాలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న హమాలీలు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
హమాలీలందరికీ ప్రభుత్వం కూలీరేట్లు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన హమాలీలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించి, 55 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలన్నారు. హమాలీలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేసి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి: 'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'