కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ ఉమెదర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా 2కె రన్‌ను ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు 2కె రన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని సీఐ రమేష్, ప్రతినిధులు సత్యం శ్రీనివాస్, శంకర్, శ్రావణ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.