కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్కి తరలిస్తున్నారు. గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించి… తగు సూచనలు చేస్తున్నారు. కరోనా సోకిన వారు బహిరంగ ప్రదేశాలు తిరుగుతూ వైరస్ వ్యాప్తికి పాల్పడుతున్నారని… వారిని గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని... భౌతిక దూరం, స్వీయ నియంత్రణ పాటిస్తూ వైరస్ సోకకుండా జాగ్రత్త వహించాలన్నారు. పట్టణంలో సుమారు 600 మంది కోవిడ్ బాధితులు ఉన్నారని... స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి మెడిసిన్తో పాటు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని ఏసీపీ తెలిపారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. స్వీయ నియంత్రణతో మహమ్మారిని తరిమికొట్టాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : Balayya Birthday: నటనలో క్లాస్.. యాక్షన్లో ఊరమాస్!