పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజీ 60 గేట్లను అధికారులు ఎత్తివేశారు. వారం రోజులుగా పార్వతీ బ్యారేజీ గేట్లను ఒక్కొక్కటిగా తెరిచి నీటిని వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్రంలో భారీ వర్షాలు కురవగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2,03,620 క్యూసెక్కుల నీటిని వదలడం వల్ల పార్వతీ బ్యారేజీ నిండుకుండలా మారింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 130 మీటర్లు కాగా.. ప్రస్తుతం 128.75 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 8.83 టీఎంసీలకు ప్రస్తుతం 6.895 టీఎంసీల నీరు ఉంది.
- ఇదీ చూడండి : లైవ్ వీడియో: అమాంతం ప్రవాహంలో పడిపోయిన లారీ