పెద్దపల్లి జిల్లా మంథనిలోని మంథని మిత్ర వారి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. రావుల చెరువు కట్ట, గంగపూరి, రాజీవ్ నగర్ ప్రాంతాల్లోనిొ వలస కూలీలు, కరోనా బాధితులకు ఆహారం పంపిణీ చేశారు.
బృందం సభ్యులు వంట చేసి, ప్యాకింగ్ చేసి వీధులన్నీ తిరుగుతూ ఆహారాన్ని అందిస్తున్నారు. అన్నం, పప్పు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను ఇస్తున్నారు. ఆహార పంపిణీ కార్యక్రమంలో మంథని సీఐ జీ. సతీశ్ పాల్గొని యువకులను ప్రోత్సహిస్తున్నారు.
ఇదీ చదవండి: నాలుగు రాష్ట్రాల సీఎంలతో మోదీ సంభాషణ