పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది తీరంలోని పుష్కరఘాట్‌లో మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఆరు లక్షల చేప పిల్లలను జడ్పీఛైర్మన్ పుట్ట మధు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్య్సకారులను ప్రోత్సహించడానికి, వారికి ఆర్థికంగా చేయూత అందించడానికి ఉచితంగా గోదావరి తీరంలో ఏటా చేపపిల్లలను అందిస్తుందని ఆయన తెలిపారు.
మరో కోనసీమలా..
ఈ సంవత్సరం మంథని, సిరిపురం బ్యారేజ్‌ల వద్ద చేపల జాతర ఏవిధంగా జరిగిందో మనం చూశామని ఆ చేపలను చూస్తే మరో కోనసీమ ప్రాంతం గుర్తొచ్చిందని మధు అభిప్రాయం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన చేపపిల్లల, గొర్రెల పంపిణీ కార్యక్రమాల ద్వారా కులవృత్తులను ప్రోత్సహించడం వల్ల బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఆదాయం పెరిగిందని వెల్లడించారు. అదేవిధంగా ఈసంవత్సరం మంథని డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 50లక్షల చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఎలుగూర్ రంగంపేట్ చెరువులో చేప పిల్లలను వదిలిన చల్లా