Farmer suicide attempt in front of Peddapally District Collectorate : రాష్ట్రంలో భూతగదాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించమంటూ బాధితులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదు. అధికారుల అలసత్వం, భూవ్యవస్థ నిర్వహణలో లోపం మొదలగు కారణాలతో భూసమస్యల పరిష్కారం అందని ద్రాక్షగా మారింది.
తమ అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూసమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని రైతు మనస్థాపం చెందాడు. ధర్మారం మండలం కిలా వనపర్తికి చెందిన రాంచంద్రరావు అనే రైతు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనతో పాటు తన ఇద్దరు అన్నదమ్ములు ఒక్కొక్కరికి 14 ఎకరాల భూమిని గతంలో సమానంగా పంచుకున్నట్లు తెలిపారు. కాగా తనకున్న 14 ఎకరాల్లో ఏడెకరాలను తన ఇద్దరు సోదరులు.. తన సంతకాలని ఫోర్జరీ చేసి వేరే వారికి భూమి అమ్మినట్లు తెలిపారు.
ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో.. ఈ రోజు పెద్దపెల్లి కలెక్టర్‌ను ఆశ్రయించాడు. కానీ కలెక్టరేట్లోని అధికారులు సైతం తనను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. బయటకు వచ్చిన రాంచంద్రరావు తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు.
అక్కడున్న స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. అప్పటికే రాంచంద్రరావు శరీరం పూర్తిగా కాలిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాంచంద్రరావును పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామచంద్రరావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు గతంలో సెక్రటేరియట్లో పనిచేసి పదవి విరమణ చేసినట్లు స్థానికులు తెలిపారు.
మరిన్ని పెరిగిన భూతగాదాలు.. రాష్ట్రంలోని భూరికార్డులను కంప్యూటరీకరించి కేసీఆర్ సర్కార్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. భూరికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు, అవినీతికి తావులేకుండా ధరణి పోర్టల్ పనిచేస్తోందని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ధరణిలోని లోపాలు అక్రమార్కులకు వరంగా మారుతోంది. నకిలీ దస్త్రాలు సృష్టించి ఎకరాల కొద్ది భూముల్ని ఎవరికీ తెలియకుండా కాజేస్తూ.. అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. లోపాలమయంగా మారిన ధరణి వ్యవస్థలో గుర్తించిన 20 సమస్యలను 4 వారాల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏకు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి:
- Junior Panchayat Secretary Suicide : జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
- Farmers Attempts To Suicide : కలెక్టరేట్లో భూనిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం
- RFCL victim attempted suicide : ఉద్యోగం రాలేదని ఆత్మహత్యాయత్నం.. చివరికి
- A young man died getting married tomorrow : రేపు పెళ్లి.. కరెంట్ షాక్‌తో వరుడు మృతి