FARMER COMMITTED SUICIDE: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భూనిర్వాసితుడు సముద్రాల సమ్మయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూమిని కోల్పోతున్నారు.
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో సమ్మయ్యకున్న 51 గుంటల భూమి జాతీయ రహదారి విస్తరణలో కోల్పోతున్నారు . దీంతో కుటుంబ పోషణ, ఆడపిల్లల పెళ్లిళ్లు భారమని భావించి మనస్తాపం చెందారు. ఆదివారం సాయంత్రం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అతన్ని కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 7న నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణపై మంథని, ముత్తారం, రామగిరి మండలాల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా అదనపు పాలనాధికారి లక్ష్మీనారాయణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో సమ్మయ్య పాల్గొన్నాడు. అప్పటి నుంచి దిగాలుగా ఉన్నాడని భూమి పోతుందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: Crops protect with Bear: అన్నదాతల ఉపాయం.. పంటల రక్షణకు భల్లూకం