పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వకీలుపల్లి గ్రామ శివారులో నాటుసారా స్థావరాలను ఎక్సైజ్ సీఐ గురువయ్య ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అనుమానిత ప్రదేశాల్లో తనిఖీ చేశారు.
నాటుసారా తయారు చేస్తున్న సమయంలో నిందితులను పట్టుకొని, వంద లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దుబ్బలపల్లి, చిల్లపల్లి గ్రామస్థులుగా గుర్తించారు. మంథని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు.
ఇదీ చూడండి: కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'