ఎంతో మంది మేధావులను, శాస్త్రవేత్తలను, దేశ సేవకులను తయారు చేసిన ఉపాధ్యాయులు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా భాజపా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ అన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరిఖనిలోని భాజపా కార్యాలయంలో స్నేహ హస్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన 50 మంది ప్రైవేటు టీచర్లకు 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులను అందించారు.
రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు.. ఉన్నత విద్యను అభ్యసించి ఈ రోజు ఆకలితో అలుమటిస్తోన్న టీచర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు