పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తించే 98 మంది కార్మికులకు నిత్యావసరాలను స్థానిక వ్యాపారులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులను కార్మికులకు అందజేశారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, కిరాణా వర్తక, అడ్తి సంఘాలు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. నిత్యావసరాలతోపాటు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు.
ఇవీచూడండి: పెళ్లి కోసం 850కి.మీ సైక్లింగ్- ముహూర్తం టైమ్‌కు క్వారంటైన్