కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు జిల్లా న్యాయమూర్తి భారత లక్ష్మి. 50 మందికి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, శానిటైజర్లను గోదావరిఖని ప్రథమ శ్రేణి న్యాయమూర్తి పర్వతపు రవితో కలిసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బల్మూరి అమరేందర్ రావు, శ్రీ కొత్తకాపు సుధాకర్ రెడ్డి , సొగల కుమార్, సంజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.