ETV Bharat / state

అంతర్జాలంతో పాఠాల నిర్వహణపై విద్యాశాఖ సర్వే - కరోనా వైరస్​ వార్తలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకమైంది. సర్కారు బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు పేదవారే కావడం వల్ల ఆన్​లైన్​ బోధన సాధ్యమేనా? అని విద్యాశాఖ సర్వే నిర్వహించింది. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన సర్వే జాబితాను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో చాలా వరకు ఇంటర్నెట్​ సౌకర్యం లేదని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు.

Department of Education Survey on online classes in telangana
అంతర్జాలంతో పాఠాల నిర్వహణపై విద్యాశాఖ సర్వే
author img

By

Published : Jul 23, 2020, 11:55 AM IST

కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందో? లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై విద్యా శాఖ దృష్టి సారించింది. సర్కారు బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఆన్‌లైన్‌ బోధన సాధ్యమేనా? అనే కోణంలో వివరాలు సేకరించారు. క్షేత్ర స్థాయిలో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగుచూశాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సగం మంది విద్యార్థులకు టెలివిజన్‌, అంతర్జాల(ఇంటర్నెట్‌) వసతి అందుబాటులో లేదని వెల్లడైంది. టీ-శాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు బోధించాలని భావిస్తుండగా అంతర్జాల సదుపాయం లేకపోవడం ఆటంకంగా మారింది. పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాల్లో నిర్వహించిన సర్వే జాబితాను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వే ఆధారంగా ఆన్‌లైన్‌ పాఠాల బోధనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో బోధిన చేపట్టాయి. జిల్లాలో 105 ఉన్నత, 83 ప్రాథమికోన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 354 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

టీ-శాట్‌ ద్వారా పాఠాలు

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన కోసం టీ-శాట్‌ సౌకర్యాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సర్కారు బడుల్లో రోజువారీగా ఈ విధానం అమలవుతోంది. పాఠశాలల్లో టీవీలు, అంతర్జాల సదుపాయం అందుబాటులో ఉండటంతో నిర్వహణకు ఇబ్బంది లేదు. ఈ విధానాన్ని విద్యార్థుల చెంతకు తేవాలనే దిశగా ఆలోచిస్తున్నారు. రోజువారీగా పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు టీవీల ముందు కూర్చొని వాటిని వినాల్సి ఉంటుంది.

టీవీలు, చరవాణులు లేవు

సర్కారు బడుల్లో ఆన్‌లైన్‌ బోధనకు అవసరమైన విద్యుత్తు, టీవీ, ఇంటర్నెట్‌ సౌకర్యాలపై ప్రతి విద్యార్థి నుంచీ ఉపాధ్యాయులు సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా చాలా మంది పిల్లలకు చరవాణి అందుబాటులో లేనట్లు తేలింది. అలాగే జిల్లాలో 71.57 శాతం మంది కేబుల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తున్నట్లు తేలింది. ఇందులో 28.43 శాతం డీటీహెచ్‌, ఇతర నెట్‌వర్కులు వాడుతున్నారు. 85.14 శాతం ఇళ్లలో టీవీలు అందుబాటులో ఉన్నాయి. 99.93 శాతం మందికి విద్యుత్‌ సౌకర్యం ఉంది. ఇంట్లో టీవీలు లేకపోవడంతో 2.07 శాతం మంది ప్రత్యామ్నాయంగా చరవాణుల్లో టెలివిజన్‌ కార్యక్రమాలు చూస్తున్నారు.

అవరోధాలు అనేకం

విద్యార్థులకు టీవీలు అందుబాటులో ఉన్నా పాఠాలు వినేందుకు అంతర్జాల సౌకర్యం కావాలి. పెద్దపల్లి, రామగుండం, మంథని, సుల్తానాబాద్‌ తప్ప మిగిలిన చాలా చోట్ల ఇంటర్నెట్‌ అందుబాటులో లేదు. టీవీలు లేని వారికి చరవాణి సహాయంతో జూమ్‌ యాప్‌ ద్వారా పాఠాలు వినేలా రూపకల్పన చేస్తున్నారు. చరవాణులు కలిగిన తల్లిదండ్రులు ఉదయం పూట పిల్లలకు ఇచ్చి, వారు పనులకు వెళ్లే సమయంతో వెంట తీసుకెళ్లనున్నారు. దీంతో స్మార్టుఫోన్ల కొనుగోలు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కానుంది. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్‌ సమస్య తలెత్తనుంది.

పెద్దపల్లి జిల్లాలో సర్వే వివరాలు

అంశం

కలిగి ఉన్న విద్యార్థులు

(శాతాల్లో)

విద్యుత్​ సౌకర్యం99.93
టెలివిజన్​ సదుపాయం85.14
కేబుల్​ నెట్​వర్క్​71.57
డీటీహెచ్​, ఇతర నెట్​వర్క్​28.43

విద్యాశాఖకు నివేదించాం:

-జగన్మోహన్‌రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించి విద్యుత్‌, టీవీలు, ఇంటర్నెట్‌ సౌకర్యాలపై మండలాల వారీగా సమాచారాన్ని తెప్పించాం. క్షేత్ర స్థాయిలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలు సేకరించారు. సమగ్ర నివేదికను విద్యాశాఖకు పంపించాం.

ఇవీ చూడండి: క్వారంటైన్ కేంద్రంలో ఖాళీ లేక రోడ్డుపైనే బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.