ETV Bharat / state

పుట్టా మధుకర్​తో ప్రాణహాని ఉంది.. రక్షించాలంటున్న ప్రేమజంట - మానవ హక్కుల కమిషన్​

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్​ పుట్టా మధుకర్​తో ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. తమకు రక్షణ కల్పించాలని కమిషన్​ను వేడుకున్నారు.

couple approched human rights commission in hyderabad
పుట్టా మధుకర్​తో ప్రాణహాని ఉంది.. రక్షించండి..
author img

By

Published : Jun 17, 2020, 6:36 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన ఓ ప్రేమజంట పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్, తెరాస నేత పుట్టా మధుకర్​తో ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించింది. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ సోదరుడు, ప్రముఖ కాంట్రాక్టర్​ పుట్టా ముఖేష్ కూతురు పుట్టా శరణ్య అదే ప్రాంతానికి చెందిన... పద్మశాలి కులస్థుడైన రవి ప్రేమించుకున్నారు.

తమ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా... తాము మేజర్లమై పెళ్లి చేసుకున్నామని బాధిత ప్రేమ జంట కమిషన్​కు వివరించారు. తమ తల్లిదండ్రులు రాజకీయ పలుకుబడితో అత్త మామలతో పాటు తన భర్తను వేధింపులకు గురిచేయడమే కాకుండా చంపుతామని బెదిరిస్తున్నారని శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. తమకు రక్షణ కల్పించే విధంగా సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని... వారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను వేడుకున్నారు.

ఇవీ చూడండి: 'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.