పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు దొరికిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని... వ్యక్తిగత నష్టంతో పాటు ఇతరులకు కూడా ప్రమాదం తెచ్చే అవకాశం ఉందని ఏసీపీ రామ్‌రెడ్డి పేర్కొన్నారు.
ద్విచక్రవాహనంపై వెళ్లే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు నిబంధనలు పాటించాలని వెల్లడించారు. మరోసారి మద్యం తాగి వాహనం నడపబోమని... మందుబాబులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రహదారి ప్రమాదాలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించి వారికి అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: అప్రమత్తంగా ఉన్నా.. ఆందోళన తగ్గట్లే!