ETV Bharat / state

పత్తి కొనుగోలు చేస్తారా.. లేదా? : రైతుల ఆందోళన - పత్తి కొనుగోలు చేస్తారా.. లేదా: రైతుల ఆందోళన

పంట పండించడానికి రైతన్న ఎంత కష్టపడుతున్నాడో పండిన పంటను అమ్ముకోవడానికి అంత కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డుకు తెల్లవారుజామునే పత్తి తీసుకొచ్చారు రైతులు. మధ్యాహ్నం 3 గంటలు అవుతున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల ఆవేదన చెందిన అన్నదాతలు రోడ్డెక్కారు.

పత్తి కొనుగోలు చేస్తారా.. లేదా: రైతుల ఆందోళన
author img

By

Published : Nov 13, 2019, 6:53 PM IST

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తెల్లవారుజామునే పత్తి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు అయినప్పటికీ పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనామ్ కేంద్రాన్ని ముట్టడించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం తీసుకొచ్చిన పత్తిని ఆన్​లైన్​లో ఎందుకు కొనుగోలు చేయలేదంటూ ప్రశ్నించారు. రాజీవ్​ రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం మార్కెట్ అధికారులతో పోలీసులు మాట్లాడి ఆన్​లైన్​లో కొనుగోలు ప్రారంభించారు.

పత్తి కొనుగోలు చేస్తారా.. లేదా: రైతుల ఆందోళన

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

Intro:ఫైల్: TG_KRN_41_13_RAITHULANA ANDOLANA_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తెల్లవారుజామున తీసుకొచ్చిన పత్తిని మధ్యాహ్నం 3 గంటలు అయినప్పటికీ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా మార్కెట్ యార్డ్ లోని ఈనామ్ కేంద్రాన్ని ముట్టడించి అధికారులతో తీవ్ర వాగ్వాదం చేశారు. ఉదయం తీసుకొచ్చిన పత్తిని ఆన్లైన్లో ఎందుకు కొనుగోలు చేయలేదంటూ మార్కెట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు మార్కెట్ యార్డ్ ఎదుట ఉన్న రాజీవ్ రహదారిపై పరుగులు తీశారు పోలీసులు మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసినప్పటికీ బలవంతంగా రోడ్డు ఎక్కారు ఈ సందర్భంగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేస్తూ నినాదాలు చేశారు. మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చిన పత్తితో వెంటనే తెల్లవారుజాము నుంచి నిరీక్షిస్తున్నప్పటికీ అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు కలుగజేసుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం మార్కెట్ అధికారులతో పోలీస్ మాట్లాడి ఆన్లైన్ కొనుగోలు ప్రారంభించారు.
బైట్: రాజయ్య, రైతు
బైట్: అంజి, రైతు
వాయిస్ ఓవర్: ఇదిలా ఉండగా ఆన్లైన్లో కొనుగోలు చేసిన అధికారులు దళారులతో కుమ్మక్కై పత్తికి తక్కువ ధర కేటాయిస్తున్నారని పలువురు రైతులు మండిపడ్డారు. క్వింటాల్ పత్తి కి కనీసం నాలుగు వేలు కూడా పెట్టడం లేదని ఓ మహిళా రైతు తన ఆవేదన వ్యక్తం చేసింది.
బైట్: స్వరూప, రైతు

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి

For All Latest Updates

TAGGED:

cotton sale
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.