పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెనిన్ నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ ఇంటింటి సోదాలు నిర్వహించారు.
కాలనీలో అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 139 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: 'ఆరు నెలల్లోపు పట్టణ ప్రగతి కనిపించాలి'