కరీంనగర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శశాంక అదనపు బాధ్యతల కింద పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పెద్దపల్లి కలెక్టర్ ఛాంబర్లో నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ శశాంకను అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాద పూర్వకంగా కలిశారు.
పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉందని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ.. జిల్లాకు ఉన్న మంచి పేరును మరింత పెంచేలా పని చేస్తానని తెలిపారు. ఇందుకు అందరి సహకారం కావాలని కోరారు.