పెద్దపల్లి జిల్లా మంథనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుర జూనియర్ కళాశాల మైదానంలో... మున్సిపాలిటీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు, మున్సిపల్ ఛైర్మన్ శైలజ హాజరయ్యారు. పచ్చదనంలో తెలంగాణను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు జడ్పీ ఛైర్మన్ అన్నారు.
గాలి కలుషితమై రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని భావించిన కేసీఆర్... హరితహారం ప్రారంభించారని పుట్ట మధు అన్నారు. రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గానికి, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: యువతిని ఈడ్చుకెళ్లిన కారు