ETV Bharat / state

'వామనరావు తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందని చెప్పారు' - telangana crime news

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని గుంజపడుగులో వామనరావు తండ్రిని ఎమ్మెల్యే శ్రీధర్​బాబుతో కలిసి భట్టి పరామర్శించారు. బాధితులకు ప్రాణభయం ఉందని తమతో చెప్పారన్నారు.

bhatti vikramarka
'వామనరావు తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందని చెప్పారు'
author img

By

Published : Feb 19, 2021, 10:11 AM IST

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య లాంటి ఘటనలు తెలంగాణలో జరుగుతాయని ఉహించలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో వామన్​రావు తండ్రి కృష్ణయ్యను.. ఎమ్మెల్యే శ్రీధర్​బాబుతో కలిసి భట్టి పరామర్శించారు. బాధితులకు ప్రాణభయం ఉందని తమకు చెప్పారని.. ఇదే విషయమై రాష్ట్ర హోంశాఖ మంత్రి, డీజీపీకి లేఖలు రాస్తామన్నారు.

ఈ హత్య ఘటనలో ఎంతో మంది పెద్దల హస్తం ఉందని భట్టి ఆరోపించారు. హత్యజరిగిన 24 గంటలు గడిచినా.. సీఎం, మంత్రులు ఖండించలేదని భట్టి అన్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్​ చేశారు.

ఈ హత్య కేసులో ఎలాంటి దర్యాప్తు చేయకుండానే రామగుండం కమిషనర్ ప్రకటనలు చేయడాన్ని భట్టి తప్పుపట్టారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా ఉందని అనుమానం వ్యక్తం ేశారు. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసు విచారణ పూర్తయ్యే వరకు రామగుండం కమిషనర్​ను తప్పించాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: నిందితులు ఎవరైనా వదలిపెట్టం: ఐజీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.