ETV Bharat / state

'కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పేదంతా అబద్ధం' - telangana news today

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పేదంతా అబద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆ పథకంతో ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు అందించలేదని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్​లో కాంగ్రెస్​ హాయంలో కట్టిన ప్రాజెక్టుల ఆధారంగానే సాగునీరు అందుతోందన్నారు.

clp leader bhatti said Everything the government says about the Kaleshwaram project is a lie
'కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పేదంతా అబద్ధం'
author img

By

Published : Feb 13, 2021, 2:00 AM IST

ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. పెద్దపెల్లి జిల్లా పెద్దకల్వల గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రైతుల ముఖాముఖిలో కేసీఆర్ తీరుపై భట్టి మండిపడ్డారు.

తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ఏడేళ్లలో రాష్ట్రాన్ని మూడు లక్షల 50 వేల కోట్ల అప్పుల్లోకి దించారని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్​లో గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే సాగునీరు అందుతుంది తప్ప.. ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. రైతుబంధు పేరుతో కాలాన్ని వెళ్లదీస్తున్న ముఖ్యమంత్రి రైతులను.. అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేసేందుకు కుట్రపన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : రాబోయే ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.