కల్యాణ లక్ష్మీ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మీ పథకాన్ని నియోజకవర్గంలో ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. 2018లో తిరిగి తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యాలయంలో అధికారులకు వారి సమస్యలను చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మొదటగా నీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరుతామని తెలిపారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పరామర్శించిన మురళీధరరావు