ETV Bharat / state

మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే మార్గానికి నిధులందేనా...? - peddapally

నేడు ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​పై జిల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైలు మార్గాలకు నిధుల కేటాయింపు, ఆదాయ పన్ను పరిమితి పెంపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే మార్గానికి నిధులందేనా...?
author img

By

Published : Jul 5, 2019, 9:44 AM IST

కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న మోదీ సర్కారు వరాల జల్లుల్ని కురిపిస్తుందనే ఆశ అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాలకు కేటాయింపులు.. కొత్తగా నాలుగు జిల్లాలకు దక్కాల్సిన ప్రయోజనాలు.. రైలు మార్గాలకు నిధుల కేటాయింపులు.. అన్నింటికీ మించి వేతన జీవులను ఊరిస్తున్న ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ఉత్కంఠ నెలకొంది.

పలు జిల్లాలకు అనుసంధానమైన జగిత్యాల-కరీంనగర్‌- వరంగల్‌ జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన నిధులు, ఇదే తరహాలో కరీంనగర్‌- సిరిసిల్ల- పిట్లం, సిరిసిల్ల- సిద్దిపేట- జనగాం, జగిత్యాల- మెట్‌పల్లి- నిజామాబాద్‌, నిర్మల్‌-ఖానాపూర్‌- జగిత్యాల, రాయపట్నం-కరీంనగర్‌-కోదాడ మార్గాలకు కేటయింపులు కోరుతున్నారు. పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేసే కల సాకరమయ్యేలా ఈ బడ్జెట్‌లో ప్రస్తావన ఉంటే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల రైతాంగానికి ఊహించని మేలు జరగనుంది. కొత్తగా కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలనుకునే ట్రిఫుల్‌ ఐటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఇక్కడి విద్యార్థి లోకానికి మేలు జరిగేవీలుంది. ఇదే తరహాలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాల ఏర్పాటు సాకారం కావాలి.

స్మార్ట్‌ సిటీకి ఊతమిచ్చేలా మరిన్ని నిధులు అందాలి. ఆకర్షణీయ పట్టణాల జాబితాలో ఉన్న కరీంనగర్‌కు సమున్నత స్థానం అందేలా గతంలో పెట్టిన ప్రతిపాదనలకు సర్కారు సై అంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఆశించిన అభివృద్ధి కళ్లకు కనిపించే వీలుంది. సిరిసిల్ల జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమల విషయంలో సిరిసిల్ల జిల్లాది అగ్రస్థానం. మరమగ్గాల వస్త్రోత్పత్తి రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల వేల సంఖ్యలో ఉన్నారు. వీరి జీవనోపాధికి వీలుగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేరేలా ప్రగతి ఫలాలు అందాలి.

ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ కూలీ పనులు చేసే వారికి మరింత మేలు కలిగేలా కొత్తగా నిధులు సహా వ్యవసాయానికి అనుబంధంగా అవసరమైన నిర్ణయాలు విత్తమంత్రి మాటల్లో వినిపించాలి. కొత్త మార్గదర్శకాలు ఉపాధి హామీ పథకంలో అగుపించాలి. ఉద్యోగ కల్పన సహా అన్నదాతలకు ఊతమిచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మరిన్ని నిధులు అందితే జిల్లాలో యువతకు, రైతులకు ఊహించని మేలు జరిగే వీలుంది. కీలకమైన జలశక్తి పథకానికి భారీగా నిధులు అందితే జిల్లాకు వరంగా మారే వీలుంది.

నిధుల ‘కూత’పై ఆశలు...

ఉమ్మడి కరీంనగర్‌లోని ప్రధాన మార్గంగా విలసిల్లుతున్న రైల్వే లైన్ల విషయంలో మరిన్ని నిర్ణయాలు జిల్లాకు మేలును చేకూరుస్తాయి. మరీ ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో రైల్వే ప్రగతి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు అందాల్సిన అవసరముంది. ప్రధానంగా సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలకు ఉపయుక్తంగా మారే మనోహరాబాద్‌- కొత్తపల్లి రైల్వే మార్గానికి ఈ బడ్జెట్‌లో అందే నిధుల ఆధారంగానే మున్ముందు జరిగే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ బడ్జెట్‌లో జిల్లా వాసుల ప్రధాన చూపు రైల్వే రంగంపైనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

కరీంనగర్‌ను రైల్వే కూడలిగా మార్చే విషయంలో ఇప్పటికే అందిన పలు రకాల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపేలా నిధులు జిల్లాకు కేటాయింపుల రూపంలో చేజిక్కాలి. విద్యుద్ధీకరణ పనులతోపాటు కొత్త మార్గాలకు అవసరమైన సర్వేకు నిధులు, కొత్త రైళ్ల ఏర్పాటు, మార్గాల పొడిగింపు, స్టేషన్ల ఆధునికీకరణకు దండిగా నిధులు అందితే ప్రయాణ సౌలభ్యం మరింత పెరగనుంది. రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిలుపుదలతోపాటు నూతన రైళ్ల ప్రకటన ఊరిస్తోంది

ఇవీ చూడండి: నేటి నుంచి కొత్త జడ్పీల పాలన

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.