ETV Bharat / state

Bhatti: 'దళిత బంధు తరహాలో.. బీసీ బంధు ప్రారంభించాలి' - KCR latest news

Bhatti Vikramarka Open Letter to CM KCR: రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క లేఖ రాశారు. 54శాతం ఉన్న బలహీన వర్గాలకు కేవలం 5 శాతం నిధులా అని ప్రశ్నించారు. దళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka
author img

By

Published : Apr 19, 2023, 3:57 PM IST

Bhatti Vikramarka Open Letter to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు.. 5 శాతం బడ్జెట్‌ కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సీఎంకు బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. పాదయాత్రలో భాగంగా అనేకమందితో మాట్లాడానని చెప్పారు. బడుగుబలహీన వర్గాలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని భట్టి విక్రమార్క అన్నారు.

ఉమ్మడి రాష్ట్రం కంటే అధ్వాన్నంగా: స్వరాష్ట్రం వస్తే నిధులు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కానీ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం కంటే అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. 54 శాతం ఉన్న బలహీన వర్గాలకు కేవలం 5 శాతం కేటాయిస్తున్నారని అన్నారు. కేటాయించిన నిధులను కూడా సరిగ్గా విడుదల చేయడం లేదని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని బీసీలు, వివిధ వర్గాలతో మాట్లాడిన తర్వాత.. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశానని భట్టి విక్రమార్క చెప్పారు.

దళిత బంధు తరహాలో బీసీ బంధు: జనాభా ప్రాతిపదికన.. దామాషా పద్ధతిన నిధులు కేటాయించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దళిత బంధు తరహాలో బీసీ బంధు కూడా ప్రారంభించాలన్నారు. ఈ సంవత్సరం రూ.2.90లక్షల బడ్జెట్​లో బీసీలకు కేటాయించింది కేవలం 5 శాతం అని తెలిపారు. రాష్ట్రంలో అధిక శాతం జనాభా బీసీలు ఉన్న దృష్ట్యా.. బీసీ బంధు పథకం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన 54శాతం కేటాయించాలని కోరుతున్నానని చెప్పారు. ఆ తర్వాత ఎలా వినియోగించాలో ఆలోచిద్దామని భట్టి విక్రమార్క వివరించారు.

"బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాను. బీసీలకు నిధుల కేటాయింపులో సీఎం కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారు. 54శాతం ఉన్న బలహీన వర్గాలకు కేవలం 5 శాతం నిధులా..?. కేటాయించిన నిధులు కూడా విడుదల చేయడం లేదు. స్వరాష్ట్రం వస్తే నిధులు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారు. కానీ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం కంటే అధ్వాన్నంగా మారింది. జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిన నిధులు కేటాయించాలి. దళితబంధు తరహాలో బీసీ బంధు ప్రారంభించాలి. " - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

దళిత బంధు తరహాలో.. బీసీ బంధు ప్రారంభించాలి

ఇవీ చదవండి: Bhatti: 'రాష్ట్రంలో దోపిడీ చేసిన సొమ్ముతో దేశవ్యాప్తంగా కేసీఆర్​ రాజకీయ చదరంగం'

Uttam Kumar Reddy: 'నా జిల్లాలో సమావేశమా.. ఏమో నాకేం తెలియదే..'

'రాష్ట్రాల అభిప్రాయాలూ వినండి'.. స్వలింగ వివాహాల కేసులో కేంద్రం రిక్వెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.