నేడు సంకట చతుర్ధి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గణపతి దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. పెద్దపెల్లి జిల్లా మంథనిలోని శ్రీ గణాధిపతి దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి విశేష పూజలు నిర్వహించారు.
ఉదయమే అర్చకులు స్వామి వారికి పంచామృతాలతో, గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతర అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేసిన భక్తులు సింధూరంతో, తమలపాకులతో, రకరకాల పూవులతో స్వామి వారిని అలంకరించారు. కొబ్బరిముక్కలు, పండ్లను నైవేద్యముగా సమర్పించి, మంగళ హారతులనిచ్చారు. ఈ ఏడాదిలో తమ కష్టాలన్ని తొలగిపోయి, ఆయురారోగ్యాలతో వర్దిల్లేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు.
ఇదీ చదవండి : ఒకరి నుంచి 22మందికి కరోనా.. ఉలిక్కిపడ్డ సూర్యాపేట