పెద్దపల్లి పురపాలక కార్యాలయంలో ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మహిళలకు పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ మమతా రెడ్డి ఆధ్వర్యంలో మహిళలందరికీ చీరలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసిఆర్ తోబుట్టువులా మారి పండుగకు బతుకమ్మ చీరల రూపంలో కానుకలిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చీరల పంపిణీ ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చీరలు తీసుకోవాలని సూచించారు.