ETV Bharat / state

'ముఖ్యమంత్రిగా కేటీఆర్​ను చేయడు'

తెలంగాణ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలంటే 2023 ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సత్తా భాజపాకు మాత్రమే ఉందని అన్నారు. పెద్దపెల్లి జిల్లాలో పర్యటించిన ఆయన జూలపల్లి, సుల్తానాబాద్​లో కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

bandi sanjay comments on kcr Will not make KTR as Chief Minister
'ముఖ్యమంత్రిగా కేటీఆర్​ను చేయడు'
author img

By

Published : Dec 27, 2020, 7:57 PM IST

'ముఖ్యమంత్రిగా కేటీఆర్​ను చేయడు'

పెద్దపెల్లి జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటించారు. జూలపల్లి, సుల్తానాబాద్​లో దివంగత మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటస్వామి కుమారుడు వివేక్​తో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సుల్తానాబాద్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి ప్రసంగించారు.

తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమరవీరులతోపాటు.. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులను విస్మరించినట్లు బండి ఆరోపించారు. గడిచిన ఆరేళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు, యువత, నిరుపేదలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే తెరాస నాయకులను నిరుద్యోగులు ప్రశ్నించాలని కోరారు. కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు దివంగత మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి చేసిన సేవలను ఆయన కొనియాడారు.

రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ.. కేసీఆర్​ కుటుంబంలో మాత్రం పదవులు తెచ్చుకున్నారని బండి ఎద్దేవా చేశారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రిగా చేయడనీ.. ఎంపీ సంతోష్​ కుమార్​కు కేసీఆర్​ తగాదా పెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 'వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు, నియంత్రిత సాగు ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.