ETV Bharat / state

'స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ నిస్వార్ధ సేవా గుణాన్ని పెంచుతుంది' - స్కౌట్స్​

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బేడెన్​పావెల్​ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఆర్జీ-1 జీఎం నారాయణ హాజరయ్యి బడెన్​పావెల్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

badenpavel-birth-anniversary-celebrations-in-peddapalli-at-godavarikhani
'స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ నిస్వార్ధ సేవా గుణాన్ని పెంచుతుంది'
author img

By

Published : Feb 22, 2020, 3:36 PM IST

విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో దోహదపడుతుందని రామగుండం ఆర్జీ-1 జీఎం నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని బేడెన్​పావెల్ పార్క్​లో ఏర్పాటు చేసిన బడెన్​పావెల్​ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మొదటగా బడెన్ పావెల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో స్వచ్ఛందంగా సామాజిక సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన స్కౌట్స్ అండ్​ గైడ్స్​ను నారాయణ అభినందించారు. నిస్వార్ధంగా సేవ చేసే సైనికులను తయారు చేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన ఆయన అన్నారు.

అనంతరం స్కౌట్ విద్యార్థులతో శాంతి ప్రగతి యాత్ర ర్యాలీని జీఎం నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ నిస్వార్ధ సేవా గుణాన్ని పెంచుతుంది'

ఇదీ చూడండి : శివరాత్రి సందర్భంగా లక్ష్మీ పంపుహౌస్‌ 11 మోటర్లు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.