పెద్దపల్లి జిల్లా మంథనిలో పురపాలక ఎన్నికల్లో భాగంగా పోటీలో నిలిచిన అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అనుసరించాల్సిన విధివిధానాలను, ఎన్నికల ప్రవర్తనా నియమాలను, ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలనే అంశాలను వివరించారు.
ప్రతీ అభ్యర్థి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు. నామినేషన్ వేసిన రోజు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నాటికి ఖర్చు చేసిన మొత్తాన్ని లిఖితపూర్వకంగా చూపించాలన్నారు. రూ.లక్ష వరకు ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు.
ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'