Ramagundam Medical College: పెద్దపల్లి జిల్లా రామగుండంలో వైద్యకళాశాల నిర్మాణం పూర్తవడమే కాకుండా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. సింగరేణి సంస్థ వైద్యకళాశాలకు 500కోట్లు కేటాయించడమే కాకుండా ప్రతీనెల 50కోట్లు విడుదల చేసింది. వైద్యకళాశాల పునాదుల తవ్వకాల సమయంలో నల్లరేగడి భూములు కావడం వల్ల నిర్మాణం ఆలస్యమవుతుందని భావించారు.
ఏప్రిల్‌లోగా కనీసం ఓ బ్లాక్ పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు చేపట్టారు. వైద్యకళాశాలకు అనుమతి కావాలంటే కనీసం 70వేల చదరపు అడుగుల ఫ్లోర్ నిర్మాణం పూర్తి కావాలి. ఏప్రిల్‌లోగా ఒక్కో ఫ్లోర్‌లో 30వేల చదరపు అడుగుల చొప్పున 90వేల అడుగుల విస్తీర్ణం పూర్తి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఖరీదైన వైద్య విద్య ప్రైవేటులో చదివే అవసరం లేకుండా ప్రభుత్వ కళాశాలలో రావడంతో ఆర్థికంగా ఊరట లభించిందని విద్యార్థులు వారి కన్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే రామగుండం వైద్యకళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాల పరిశీలనతో పాటు ర్యాగింగ్ చేయబోమని హామీ పత్రం అందించాల్సి ఉంటుంది. మధ్యలో కళాశాల వదిలేయకుండా బాండ్ పేపర్ ఇవ్వాలన్న నిబంధన వర్తించనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ నలుమూలల నుంచి అడ్మిషన్ తీసుకుంటున్నాము. -డాక్టర్ నరేందర్, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్
ఇవీ చదవండి: